మళ్ళీ తగ్గిన బంగారం ధర.. ఎంతంటే ?

గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా తగ్గాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గగా ఢిల్లీలో మాత్రం ధర పెరిగింది. అలానే నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు ఈరోజు కూడా మళ్ళీ స్వల్పంగా పెరిగాయి. ఇక హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.370 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,550కి తగ్గింది.

 

అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,250కి తగ్గింది. అయితే ఢిల్లీ మార్కెట్‌ లో మాత్రం ఈ రేట్ పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.110 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.52,780కి చేరింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.49,300కి పెరిగింది. ఇక నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు ఈరోజు కూడా మళ్ళీ స్వల్పంగా పెరిగాయి. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ 200 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,900కు చేరుకుంది. ఇక బంగారం ధర మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని బులియన్ ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.