మొదలయిన యూఎస్ ఓట్ల లెక్కింపు.. ట్రంప్ ముందంజ !

-

అమెరికాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిగా విడుదలైన ఫలితాల్లో జో బైడెన్, ట్రంప్ మధ్య పోటీ హోరా హోరీగా సాగుతోంది. ఇప్పటి వరకు ట్రంప్‌కు 100, బైడెన్‌కు 140 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. పాపులర్, ఎలక్ట్రోరల్ ఓట్లలో అయితే బైడెన్‌ ముందంజలో ఉన్నారు. ఇక ఇండియానా స్టేట్ లో ట్రంప్ విజయం సాధించారు.

వెర్మాంట్ రాష్ట్రంలో మాత్రం బైడెన్ గెలిచారు. ఇక, కెంటకీ, వర్జీనియా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉండగా టెక్సాస్, జార్జియా, ఫ్లోరిడా, న్యూ హ్యాంప్‌షైర్‌లో బైడెన్ ముందంజలో ఉన్నారు. ఇప్పటికి బైడెన్ ఏడు రాష్ట్రాల్లో, ట్రంప్ ఐదు రాష్ట్రాల్లో పూర్తి విజయం సాధించారు. ప్రస్తుతానికి 50 రాష్ట్రాలకి గాను 25 రాష్ట్రాలలో పోలింగ్ పూర్తి అయింది. అయితే చాలా సర్వేలు ట్రంప్ కి అనుకూలంగా వస్తే కొన్ని మాత్రం బైడెన్ కి అనుకూలంగా వచ్చాయి. చూడాలి ఏమవుతుంది అనేది ?

Read more RELATED
Recommended to you

Latest news