హమ్మయ్య బంగారం మళ్ళీ పెరిగింది…!

-

కరోనా వైరస్ దెబ్బకు దాదాపు పది రోజులుగా ఇబ్బంది పడుతున్న బంగార౦ ధరలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ని అమ్మడంతో బంగారం ధరలు గత నాలుగు రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం బంగారం దాదాపుగా 800లకు పైగా తగ్గింది. వెండి కూడా కేజీకి రెండు వేల వరకు తగ్గడం గమనార్హం. ఇప్పుడు మళ్ళీ పసిడి పుంజుకుంది.

మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో కాస్త పుంజుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 110 రూపాయలు పెరిగడంతో… 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 43,670 రూపాయల నుంచి 43,780 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా కాస్త పర్వాలేదనిపించింది. 10 గ్రాములకు 110 రూపాయలు పెరిగడంతో… 39,870 రూపాయల నుంచి 39,980 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీ లో పసిడి కాస్త ఊపందుకుంది . దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కూడా స్వల్పంగా పెరిగడం తో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 42,000 రూపాయల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పెరిగి 40,800 రూపాయల వద్దకు చేరుకుంది. స్టాక్ మార్కెట్ లు పతన౦ కావడం కూడా బంగారం ధరలను ఇబ్బంది పెట్టింది అనే చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version