గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈ రోజు మాత్రం బంగారం ధరలు బారీగా తగ్గముకం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు పరిశీలించినట్లయితే….10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గింది. దాంతో బంగారం ధరలు ప్రస్తుతం రూ.44,350కి చేరుకుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. దాంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380కి చేరుకుంది.
అయితే బంగారం ధరలు తగ్గడానికి కారణం దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడమే అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఓవైపు బంగారం ధరలు తగ్గుముకం పడుతుంటే వెండి ధరలు మాత్రం పై పైకి వెలుతున్నాయి. తాజాగా కిలో వెండి ధర రూ. 500 పెరిగింది. దాంతో కిలో రూ.68,200 వద్ద కొనసాగుతోంది. ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు తగ్గుముకం పట్టడం మగువలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.