కాళ్లల్లో బ్లడ్ క్లాట్.. ప్రాణానికి ప్రమాదమా..?

-

అనారోగ్య సమస్యలని కనుక మనం పట్టించుకోకపోతే దాని వలన మరెంత ప్రమాదం ఉంటుంది. కనుక ఏ సమస్య వచ్చిన కూడా నెగ్లెక్ట్ చెయ్యకూడదు. ఈరోజు డీప్ వీన్ త్రాంబోసిస్ గురించి ఎన్నో విషయాలు చూద్దాం.

డీప్ వీన్ త్రాంబోసిస్ అంటే ఏమిటి..?

మొదట మనం ఆర్టరీస్ మరియు వీన్స్ పని గురించి చూద్దాం. సాధారణంగా ఆర్టెరీస్ ముందు ఆక్సిజన్ తో పాటు ఉండే రక్తాన్ని కాళ్ళకి పంపిస్తాయి. ఆక్సిజన్ మరియు పోషక పదార్థాలు కూడా కాళ్ళకి వెళ్తాయి. కాళ్ళలో ఉండే వీన్స్ ఆ రక్తాన్ని వెనక్కి పంపిస్తాయి. హృదయానికి మరియు ఊపిరితిత్తులకి ఈ రక్తం వెళుతుంది. దీంతో మరింత ఆక్సిజనేషన్ మరియు ప్యూరిఫికేషన్ వస్తుంది. అయితే డీప్ వీన్ త్రొమ్బోసిస్ అంటే బాడీలో ఉండే వీన్స్ లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్లాట్ ఏర్పడినపుడు ఈ సమస్య వస్తుంది.

Blood clot in the legs | కాళ్లల్లో బ్లడ్ క్లాట్
Blood clot in the legs | కాళ్లల్లో బ్లడ్ క్లాట్

పల్మనరీ ఎంబాలిజం అంటే ఏమిటి..?

పల్మనరీ ఎంబాలిజం అనేది ఒక బ్లడ్ క్లాట్ వల్ల వస్తుంది. అయితే ఇది ఊపిరితిత్తుల్లో ఉండే పల్మనరీ ఆర్టెరీస్ ని బ్లాక్ చేస్తుంది. అయితే మామూలుగా ఊపిరితిత్తులు ఆక్సిజన్ ని ఇతర శరీర భాగాలకు పంపిస్తాయి. ఒకవేళ ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే ఆ ప్రాంతానికి వెళ్లదు.

డీప్ వీన్ త్రొమ్బోసిస్ కి కారణాలు:

ఏదైనా సర్జరీ లేదా అనారోగ్య సమస్య
ఎక్కువ సేపు కార్, ట్రైన్ లేదా విమానం లో కూర్చోవడం.
ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోవడం.
బ్లడ్ క్లాట్ అయ్యే మందులు వాడడం.
ఒబిసిటీ, ప్రెగ్నెన్సీ, జెనిటిక్ మేకప్, స్మోకింగ్, స్పైనల్ కార్డ్ ఇంజురీ, స్ట్రోక్ మొదలైనవి.

లక్షణాలు ఏమిటి..?

ఈ సమస్య ఉంటే శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి.
శ్వాస తీసుకునేటప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది.
దగ్గినప్పుడు రక్తం రావడం.
రెగ్యులర్ హార్ట్ బీట్.
నీరసంగా ఉండటం.
బాగా చెమటలు పట్టడం.
జ్వరం, కాళ్ళు నొప్పి.

ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి..?

శ్వాస సంబంధిత సమస్యలు, చెస్ట్ పెయిన్, దగ్గినప్పుడు రక్తం రావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు కచ్చితంగా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి.

బ్లడ్ క్రామ్ప్స్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి..?

అనారోగ్య సమస్యలు వస్తే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ నీళ్లు తాగడం.. ఆల్కహాల్ కి దూరంగా ఉండటం చేయాలి. ప్రతి గంటకు ఒకసారి లేచి నడవాలి. ఓకే దగ్గర కూర్చోకుండా లేచి నడుస్తూ వినాలి. ఒకవేళ మీరు బెడ్ మీద ఉంటే మీ కాళ్ళని కదుపుతూ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news