బంగారు మరుగుదొడ్డి.. దాని మీద కూర్చోవాలనుందా? అయితే డబ్బులు కట్టాల్సిందే..!

-

ఈ మరుగుదొడ్డిని ఉపయోగించుకోవడానికి బ్రిటన్ ప్రజలకు కూడా అవకాశం కల్పించారు. కాకపోతే.. కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు పే చేసి ఆ మరుగుదొడ్డిని ఏం చక్కా ఉపయోగించుకోవచ్చు.

సాధారణంగా మనం సులభ్ కాంప్లెక్స్ వెళ్లినప్పుడు మరుగుదొడ్డి వాడినందుకు 5 రూపాయలో.. 10 రూపాయలో తీసుకుంటారు. కానీ.. మీరు పైన ఫోటోలో చూస్తున్నది బంగారంతో చేసిన మరుగుదొడ్డి. అవును.. 18 క్యారెట్ల మేలిమి బంగారంతో చేసిన మరుగుదొడ్డి అది. వెస్టర్న్ స్టయిల్ లో ఉన్న ఆ మరుగుదొడ్డిని బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ షైర్ లో ఉన్న బ్లెన్ హేయ్ ప్యాలెస్ లో ఏర్పాటు చేయనున్నారు.

అంటే.. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్ టన్ చర్చిల్ జన్మించిన గదికి సమీపంలోనే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అసలు.. ఈ బంగారు మరుగుదొడ్డిని తయారు చేసిన గజ్జేన్ హేమ్ మ్యూజియం.. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు బహుమతిగా ఇవ్వాలని ఆ మ్యూజియం భావించింది. అందుకే దీన్ని తయారు చేసింది కూడా. కానీ.. ఆయన మాత్రం దాన్ని స్వీకరించడానికి తిరస్కరించారట. దీంతో దాన్ని ఆ ప్యాలెస్ లో ఏర్పాటు చేస్తున్నారు.

అయితే.. ఈ మరుగుదొడ్డిని ఉపయోగించుకోవడానికి బ్రిటన్ ప్రజలకు కూడా అవకాశం కల్పించారు. కాకపోతే.. కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు పే చేసి ఆ మరుగుదొడ్డిని ఏం చక్కా ఉపయోగించుకోవచ్చు. అంత బంగారాన్ని ధరించలేకపోయినా.. కనీసం దాని మీద అయినా కూర్చునే భాగ్యం దక్కుతుందని… బ్రిటన్ ప్రజలు కూడా ఆ ప్యాలెస్ కు క్యూ కడుతున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version