ఇంట్లో చేపలను పెంచుకోవడం చాలామందికి ఇష్టం ఉంటుంది. ఎక్వేరియంలో వివిధ రకాల చేపలు ఉంటాయి. అందులో అందరి ఇంట్లో గోల్డ్ ఫిష్ అయితే కచ్చితంగా ఉంటుంది. చాలా మందికి ఈ ఫిష్ గురించి పరిచయం అక్కర్లా..అయితే ఇది తన కదలికలతో వాహనాన్ని నియంత్రించగదలని..నావిగేట్ చేయగలదని ఇజ్రాయెల్ పరిశోధకులు కనుగొన్నారు. వాళ్లు ఏం అంటున్నారంటే..
వాటర్ ట్యాంక్ లోపల గోల్డ్ ఫిష్ చలనాన్ని పసిగట్టే వాహనం నడుస్తుంది. ఆ FOVవాహనం డేటాను సేకరించడానికి పల్సెడ్ లేజర్ కాంతిని ఉపయోగించే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ లైడార్‌తో అమర్చారు.. గ్రౌండ్ లొకేషన్ .. వాటర్ ట్యాంక్ లోపల చేపల ఆచూకీ. ట్యాంక్ కంప్యూటర్, కెమెరా, ఎలక్ట్రిక్ మోటార్లు. ఓమ్ని-డైరెక్షనల్ వీల్స్‌తో లోడ్ చేయబడిన ప్లాట్‌ఫారమ్‌పై దీన్ని అమర్చారు.
వీటి సహాయంతో గోల్డ్ ఫిష్ వాహనాన్ని నడిపేలా ట్రైనింగ్ ఇస్తారు… వాహనం పైకి చేప చేరేలా ట్రైన్ చేశారు. తరువాత దానికి అమర్చిన ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ డివైస్ సహాయంతో వాహనాన్ని ఎలా నడపాలో దానికి సూచనలు అందించారు. దీంతో గోల్డ్ ఫిష్ ఆ వాహనాన్ని విజయవంతంగా చేపల తొట్టిలో అటూ ఇటూ తిప్పగలిగింది.
వాహనం నడపడం నేర్చుకోవడానికి చేపలకు ఎక్కువ సమయం పట్టలేదని పరిశోధకులు అంటున్నారు. ఇప్పటివరకూ చేపలపై ఇటువంటి ప్రయోగం చేయడం ఇదే మొదటిది. ఇంతదాకా ఆరు గోల్డ్ ఫిష్‌లకు వాహనాన్ని నడపడాన్ని నేర్పించారు. వాటిలో ఒక్కొక్కదానికి దాదాపు పది డ్రైవింగ్ పాఠాలు చెప్పారట.. వాహనం నడపడం కోసం ఒక జంతువును ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కుక్కలు, పిల్లులు, ఎలుకలను వాహనం నడపడం కోసం ఉపయోగించారు. అయితే చేపలతో చేయడం మాత్రం ప్రత్యేకమైనది. అయితే ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనేది వారు వెల్లడించలేదు.
అయితే చేపలకు ఇలా ట్రైనింగ్ ఇచ్చి వాహనం నడపడం చూడ్డానికి మాత్రం ఆసక్తికరంగా ఉంది. వీటితో ఎగ్జిమిషన్లో పబ్లిక్ గాథరింగ్స్ పెట్టి నడించవచ్చమే..ఇది చూసిన నెటిజన్లు తాలా ఓ మాట అంటున్నారు. మీరు ఈ వీడియో చూడండి..మొత్తానికి చేప తన కదలికల ద్వారా ఈ బుజ్జి వాహనం నడపడం మాత్రం భలే క్రేజీగా ఉంది.