రెండు మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ వారం మొదటి నుంచి బంగారం ధరలు చాలా వేగంగా తగ్గాయి. మూడు వేల వరకు తగ్గింది బంగారం. అయితే తాజాగా ఇది పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో శనివారం బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 230 రూపాయల వరకు పెరిగింది. దీనితో 39,960 రూపాయలకు చేరుకుంది బంగారం.
24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఏకంగా 710 రూపాయల వరకు తగ్గింది. దీనితో 43,980 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం లలో 22 క్యారెట్లు పది గ్రాములకు 230 రూపాయల పెరిగింది. దీనితో 39,960 రూపాయలుగా ఉంది బంగారం. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే… పది గ్రాములకు 720 రూపాయల పెరగడంతో 43,980 రూపాయలకు చేరుకుంది.
ఇక్కడ వెండి ధర వెండి ధర 40,270 రూపాయల వద్దకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 730 రూపాయలు పెరగడంతో 44,200 రూపాయలకు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 720 రూపాయలు పెరగడంతో 41,900 రూపాయలకు చేరింది. కొన్ని రోజులుగా బంగారం డిమాండ్ భారీగా పడిపోయింది.