షాకింగ్; గాలి ద్వారా కరోనా…? ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పేది ఏంటీ…?

-

కరోనా వైరస్ వ్యాపించే విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. సామాజిక దూరం పాటించినా సరే కరోన వైరస్ వ్యాపిస్తుంది అని పలువురు అంటున్నారు. అయితే కరోనా వైరస్ విషయంలో ఏ మాత్రం అలసత్వం పనికి రాదు అంటున్నారు. సామాజిక దూరం ఒక్కటే మార్గం అని మూర్ఖంగా ఆలోచించవద్దు అని పలువురు కాస్త ఘాటుగా సూచనలు చేస్తున్నారు. ఇక అది గాలి ద్వారా వ్యాపిస్తుంది అనే ప్రచారం ఉంది.

కాని అది నిజం కాదని అంటున్నారు చాలా మంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చింది. వైరస్ ఉండే తుంపల్లు గాలిలో ప్రయాణిస్తాయనీ, గాలిలో ఈ వైరస్ ఎక్కువ సేపు బతకదని పేర్కొంది. తుంపర్లు వైర్వేరు సైజులలో ఉంటాయని తుమ్మే, దగ్గే వ్యక్తి (అతనికి కరోనా ఉంటే) పక్కన నిలబడే వారిపై తుంపర్లు పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

కాని గాలి గాలి ద్వారా వ్యాపించే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. చైనాలో 75465 మంది కరోనా పేషెంట్లను పరీక్షించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఒక్కరికి కూడా గాలి ద్వారా వైరస్ వ్యాపించినట్లు పరీక్షల్లో వెల్లడి కాలేదు. గాలి ద్వారా కంటే ఇతర మార్గాల్లోనే ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఇతరులు తాకిన వస్తువులు తాకే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించాలి అని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news