టీఆర్ఎస్ పార్టీపై నిఘా సంస్థలు, ఈడీ దర్యాప్తు చేయాలి : గోనె ప్రకాష్

-

సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో తెలంగాణ ప్రజాస్వామ్య చర్చ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఇవాళ జరిగింది. తెలంగాణలో ప్రజాస్వామ్యమా- ధనస్వామ్యమా-ధౌర్జన్య స్వామ్యామ అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్.. మాట్లాడుతూ.. ఇది ఒక ప్రజా వేదికగా ఎంచుకున్నామని.. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కోరుతున్నామని పేర్కొన్నారు.

వాళ్ళు కూడా మాకు అండగా ఉన్నారు.. టీఆర్ఎస్ ఏడేళ్లలో అనేక రకాల అవినీతికి పాల్పడుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తోంది.. తెలంగాణ లో నియంతృత్వపాలన సాగుతోందని ఫైర్ అయ్యారు.

డబ్బును ,అధికారం అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది..స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య న్నీ మూసి నదిలో కలిపివేసిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఖర్చు పెడుతున్న డబ్బుపై నిఘా సంస్థలు,ఈడీ వంటివి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.ఓటుకి నోటు అడ్డుకోవాలని.. టిఆర్ఎస్ పార్టీని నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు గోనె ప్రకాష్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version