మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రైతులకు స్వర్ణయుగం అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… బి ఆర్ ఎస్ హయాంలో ఉన్నప్పుడు కేసిఆర్ రైతును రాజు చేశారన్నారు. కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సమయానికి విత్తనాలు ఎరువులు, రైతుబంధు కూడా సమయానికి అందించారన్నారు.
మే, జూన్ నెలల్లో 45, 50 అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా ప్రజలకు నీటి కరువు లేదని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ యే ఇప్పుడు రైతన్నలకు కరువు తెచ్చిందని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని సత్యవతి రాథోడ్ ఆగ్రహ వ్యక్తం డోర్నకల్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజున రెండు వేల మంది రైతులతో దీక్ష చేయనున్నట్లు ఆమె తెలిపారు. రైతన్నలు ఈ దీక్షలో అధిక సంఖ్యలో పాల్గొనాలని తమ హక్కులను కాపాడుకోవాలనీ తెలిపారు.