ఒకవైపు తీవ్ర స్థాయిలో ఎండలు, మరోవైపు నీటి కొరత కర్ణాటక రాష్ట్రము అల్లాడుతున్న వేళ బెంగుళూరుకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.బెంగళూర్, దక్షిణ కర్ణాటక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉగాది పండగ నుంచి వరుసగా మూడు రోజుల పాటు బలమైన గాలులు, ఉరుములతో వర్షాలు పడనున్నట్లు అధికారులు తెలిపారు.
అయితే నగరం మొత్తం ఒకే విధంగా వర్షం కురవకపోవచ్చని వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీంతో కర్ణాటక రాష్ట్రంలో కాస్త నీటి కష్టాలు తీరనున్నాయి . ఏప్రిల్ 1న బెంగుళూర్ లో 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఆ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో సగటు కంటే 3 డిగ్రీలు ఎక్కువ.