తెలంగాణా ఊపిరి పీల్చుకునే విషయం…!

-

తెలంగాణా ప్రజలు ఇప్పుడు ఊపిరి పీల్చుకునే విషయం ఒకటి బయటకు వచ్చింది. రెండు రోజుల నుంచి ఢిల్లీ లో మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ తరుణంలో ఒక వార్త ప్రజలను కాస్త ఊపిరి పీల్చుకునే విధంగా చేస్తుంది. మార్చి 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పలు దశల్లో 1030 మంది తెలంగాణ వాసులు ఢిల్లీ వెళ్ళారు.

వారిలో కొంత మంది ఢిల్లీ నుంచి వచ్చారు. 16 నుంచి 22వ తేదీల మధ్య తిరిగి వచ్చారు. కరోనా వైరస్‌ సోకిన వారి నుంచి ఇతరులకు లోకల్‌ కాంటాక్ట్‌ కింద వైరస్‌ సోకి ఉంటే, 14 రోజుల్లో బయటకు రావాలి. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 1, 2 తేదీల వరకు పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు బయటపడాలి. కాని ఇప్పటి వరకు పెద్దగా కేసులు బయటకు రాలేదు. రాష్ట్రానికి వచ్చిన ఇండోనేషియా బృందానికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మార్చి 18న గుర్తించారు.

అప్పటి నుంచి ప్రభుత్వం, నిఘా వర్గాలు చాలా వరకు అప్రమత్తం అయ్యాయి. వెంటనే వారిని గుర్తించడం మొదలుపెట్టారు. వారిలో చాలా మందికి సోకలేదు. కాని సోకిన వాళ్ళు మాత్రం ఇప్పుడు బయటపడ్డారు. ఇది కాస్త ఊపిరి పీల్చుకునే విషయమే. వనపర్తి 6, ములుగు 2, నిజామాబాద్‌ 80, నిర్మల్‌ 25, నాగర్‌కర్నూల్‌ 4, జనగామ 4, ఆదిలాబాద్‌ 30, కొత్తగూడెం 11, నల్గొండ 45, నారాయణపేట 2, వికారాబాద్‌ 13,

సిద్దిపేట 2, కామారెడ్డి 4, గద్వాల 5, కరీంనగర్‌ 17, ఖమ్మం 27, సిరిసిల్ల 4, సూర్యాపేట 10, సంగారెడ్డి 22, మంచిర్యాలలో 10, భూపాలపల్లి 1, మెదక్‌ 12, వరంగల్‌ అర్బన్‌ 38, రంగారెడ్డి 13 ఢిల్లీ వెళ్ళారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 603 మంది ఢిల్లీ వెళ్లివచ్చారు. వీరి విషయంలో తెలంగాణా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version