కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. నైట్ డ్యూటీ రూల్స్ మారాయి!

-

అవునండీ.. మోదీ ప్రభుతం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నైట్ డ్యూటీ అలవెన్స్ నిబంధనలు అన్ని మార్చేశారు. ఇంకా 7వ పే కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నైట్ డ్యూటీ అలవెన్సుల విషయంలో కొత్త నిబంధనలను జారీ చేశారు.

Good news Central Government Employees! Modi govt changes Night Duty Allowance rules

ప్రస్తుతం నైట్ డ్యూటీ ఉద్యోగులకు అలవెన్సులు అన్ని కూడా గ్రేడ్ పే ద్వారా ఇస్తున్నారు. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు. త్వరలోనే కొత్త నియమనిబంధనలు అమలులోకి వస్తాయని వారు వెల్లడించారు. ప్రస్తుతం నిబంధనలు ప్రకారం నైట్ వెయిటేజీని పరిగణలోకి తీసుకుంటే పనిగంటలు లెక్కలోకి రావు అని తెలిపారు. కాగా ఇప్పటివరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విధులు నిర్వహిస్తేనే నైట్ డ్యూటీగా పరిగణించేవారు.

ఇంకా ప్రస్తుతం నైట్ డ్యూటీ అలవెన్సుల కోసం బేసిక్ వేతనం రూ.43,600గా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వెల్లడించింది. నైట్ డ్యూటీ చేసే ఉద్యోగులకు ప్రతీ గంటకు 10 నిమిషాల చొప్పున వెయిటేజీ ఇస్తారు. గంటకు బేసిక్ పే+డీఏ 200 రూపాయిల చొప్పున లెక్కిస్తారు. ఇంకా ప్రస్తుతం డీఏ 7వ పే కమిషన్ సూచించిన ప్రకారం నైట్ డ్యూటీ అలవెన్సులకు లెక్కించే బేసిక్ పే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version