ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ లకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో కీలక అడుగు పడింది. సినోవాక్ బయోటెక్, కరోనావాక్ అభివృద్ధి చేసిన చైనీస్ కరోనా వైరస్ వ్యాక్సిన్ బ్రెజిల్ లో నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ లో వాలంటీర్లలో రోగ నిరోధక శక్తిని పెంచింది. ఇతర కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీదారులైన ఫైజర్, మోడెర్నా మరియు రష్యా తమ కరోనా వైరస్ వ్యాక్సిన్ 90% కంటే ఎక్కువ ప్రభావంతంగా ఉన్నాయని ప్రకటన చేసిన తర్వాత చైనా కూడా ప్రకటన చేసింది.

సినోవాక్, కరోనావాక్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రాథమిక పరీక్షలలో వాలంటీర్లలో రోగ నిరోధక శక్తిని విజయవంతంగా అభివృద్ధి చేసిందని వెల్లడించారు. రోగుల్లో పెరిగే యాంటీ బాడీస్ కంటే కూడా ఇవే ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. దీనిపై ఇప్పుడు చైనా చాలా ఆశలు పెట్టుకుంది.