హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులపై చర్యలు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రపతిని వ్యక్తిగతంగా కలిసి ఆమోదం పొందేందుకు వచ్చే నెల 5,6,7 ఆగస్టు తేదీలలో ఢిల్లీ పర్యటనకు వెళ్లాలని తేల్చింది. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రివర్గం వివరాల ప్రకారం.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలోనే ఈ సమస్యను పరిష్కరించడానకిి ప్రయత్నించాలని నిర్ణయించుకుంది.
ఆగస్టు 5న పార్లమెంట్ లో వాయిదా తీర్మాణం ద్వారా ఆమోదంలో జరుగుతున్న జాప్యానికి నిరసన తెలిపేందుకు పార్టీ ఎంపీలు సన్నద్ధం అవుతున్నారు. ఆగస్టు 06న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు. తరువాత రోజు ఆగస్టు 07 నాడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 200 మంది ప్రతినిధులు రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరతారు.