ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. పరీక్షా ఫీజులపై కీలక ప్రకటన చేసింది జగన్ ప్రభుత్వం. ఏప్రిల్ లో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లించని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
తత్కాల్ స్కీమ్ కింద రూ.500 అపరాధ రుసుముతో జనవరి 26 లోపు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. రూ. 1000 తో జనవరి 31 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. ఇదే ఆఖరు గడువని, మళ్లీ పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఫీజు చెల్లించకపోతే పరీక్షలు రాసే అవకాశం ఉండదని చెప్పారు.