IOCN STAR PUSHPA : బ‌న్ని అభిమానుల‌కు గుడ్ న్యూస్.. పుష్ప నుంచి అప్ డెట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల‌కు గుడ్ న్యూస్.. అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమా లో బన్ని కి సంబంధించిన కొత్త పోస్ట‌ర్ ను పుష్ప చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ కొత్త పోస్ట‌ర్ లో బ‌న్నీ లుక్ ఊర మాస్ గా ఉంది. చేతి లో తూపాకి తో విల‌న్ ల‌ను చూపు తో నే చంపేసేలా చూస్తూ ఉన్నాడు. ఈ కొత్త ఫోటో లో ఐకాన్ స్టార్ అదిరి పోయేలా ఉన్నాడు.

అయితే ఈ సినిమా కు సంబంధించిన ట్రైల‌ర్ ను డిసెంబ‌ర్ 6న విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అలాగే డిసెంబ‌ర్ 12 న ప్రీ రిలిజ్ ఈవెంట్ ను కూడా నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే పుష్ప పార్ట్ 1 సినిమా ను ఈ నెల 17 పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేయ‌నున్నారు. కాగ ఈ సినిమా లో అల్లు అర్జున్ కు జంట గా ర‌ష్మిక మంధ‌న న‌టిస్తుంది.