కేంద్ర ప్రబుత్వం ఉద్యోగులకు డీఏ ని పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేంద్ర ప్రబుత్వం ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ ని కేంద్రం పెంచాలని అనుకుంటోంది. భారత ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది. సాధారణంగా డీఏ పెరిగితే మిగిలినవి కూడా పెరుగుతాయి. ఇప్పుడు కూడా ఇదే జరగబోతోంది. అయితే హెచ్ఆర్ఏను చివరిగా ఏడాది కిందట పెంచింది.
మళ్లీ ఇప్పుడు హెచ్ఆర్ఏ పెంచితే శాలరీ కూడా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఈ పెంపు వల్ల చాలా మందికి రిలీఫ్ కలగనుంది. హెచ్‌ఆర్ఏ రేట్లు ప్రస్తుతం 27 శాతం, 18 శాతం, 9 శాతంగా ఉన్నాయి. ఉద్యోగులు వారి కేటగిరి ప్రకారం ఈ మూడింటిలో ఏదో ఒక హెచ్ఆర్ఏను పొందుతారు.
ఈ రేట్లని పెంచాలని కేంద్రం అనుకుంటోంది. ఇక ఇది ఇలా ఉంటే హౌస్ రెంట్ అలవెన్స్ ఈసారి 3 శాతం మేర పెంచచ్చనే అంటున్నారు. అంటే ఎక్స్ కేటగిరిలోని వారికి పెంపు 3 శాతంగా ఉండొచ్చు. అలాగే వై కేటగిరి లోని వారికి హెచ్ఆర్ఏ పెంపు 2 శాతంగా పెరిగే ఛాన్స్ వుంది. జెడ్ కేటగిరి లోని ఉద్యోగులకు 1 శాతం మేర పెరగొచ్చు.
ఈ మార్పు వచ్చాక హెచ్ఆర్ఏ 30 శాతంగా, 20 శాతంగా, 10 శాతంగా ఉండనున్నాయి. మినిమమ్ హెచ్ఆర్ఏ 10 శాతంగా ఉంటుంది. ఎక్స్ కేటగిరిలో ఉన్న ఉద్యోగులకు వారి బేసిక్ శాలరీలో 27 శాతం మొత్తాన్ని హెచ్ఆర్ఏ కింద అందిస్తారు. వై కేటగిరి అయితే 18 శాతం, జెడ్ కేటగిరిలో ఉన్న వారికి 9 శాతం హెచ్‌ఆర్ఏ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 శాతం నుంచి 3.68 శాతానికి పెంచాలని అంటున్నారు.