కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను ప్రభుత్వం చెప్పనుంది.ఏడో వేతన సంఘం సిఫారసు దృష్ట్యా..మోదీ నేత్రుత్వంలో జరగబోయే కేంద్ర కేబినేట్ మీటింగ్ లో డీఏ పెంపుపై నిర్ణయం తీసుకొనున్నారు. ఉద్యోగులకు డీఎ ను ఎంత పెంచనున్నారో అనే విషయం చర్చించిన తర్వాత ప్రకటించనున్నారు. దీని వల్ల.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతానికి 5 శాతం డీఏ పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని డీఏ, డీఆర్ ను కేంద్రం సంవత్సరానికి రెండు సార్లు పెంచుతుంది.
ఒక ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా జీతం పెరుగుతుంది. బేసిక్ పేలో ఇతర అలవెన్సులు ఏవీ ఉండవు. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే రూ.18000 ఉంటే.. వాళ్లకు ప్రస్తుతం ఉన్న డీఏ ప్రకారం డీఏ రూ.6120 వస్తుంది. ఇదివరకు ఉన్న డీఏ 31 శాతానికి కాలిక్యులేట్ చేస్తే డీఏ రూ.5580 వస్తుంది. ప్రస్తుతం ఉన్న డీఏ ద్వారా ఒక ఉద్యోగికి డీఏలో రూ.540 పెరుగుదుల ఉంది. ప్రస్తుతం ఉన్న డీఏను ఇంకో 5 శాతానికి పెంచితే.. ఉద్యోగికి డీఏలో 39 శాతం అంటే బేసిక్ పేలో 18 వేలతో డీఏలో రూ.7020 వస్తుంది.
జీతం రూ.900 పెరుగుతుంది. ఏడో వేతన సంఘం ప్రకారం.. 2006 లో కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ ను సవరించింది. ద్రవ్యోల్బణాన్ని బట్టి ప్రతి సంవత్సరం జనవరి, జులైలో కేంద్రం డీఏను పెంచుతూ ఉంటుంది. ఈ సంవత్సరం రిటైల్ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం వల్ల.. డీఏలో పెరుగుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ.. ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా.. డీఏలో కూడా మార్పులు ఉంటాయి. అర్బన్ సెక్టార్, సెమీ అర్బన్ సెక్టార్, రూరల్ సెక్టార్ లో పనిచేసే ఉద్యోగులకు డీఏ పెంపు వల్ల పెరిగే జీతంలో స్వల్ప తేడాలు ఉంటాయి..