కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్.2024 సాధారణ ఎన్నికలకు ముందు కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులు తీపి కబురు చెప్పింది.కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.
జనవరి 1, 2024 నుంచి ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను 4 శాతం మేర పెంచాలని మంత్రివర్గం నిర్ణయించిందని వెల్లడించారు. ఈ నిర్ణయంతో 48.67 లక్షల ఉద్యోగులకు, 67.95 లక్షల పెన్షనర్లకు లబ్ధి కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం బేసిక్ పేపై 46% డియర్‌నెస్ అలవెన్స్ పొందుతుండగా అది 50%కి చేరనుంది.