హరిరామ జోగయ్య,ముద్రగడ పద్మనాభం లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరోక్ష కామెంట్లు చేశారు.నిన్న మొన్నటిదాకా తనకు సలహాలు ఇచ్చిన వారంతా.. ఇప్పుడు వైసీపీలో చేరిపోయారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ‘నేను ఎలా ముందుకెళ్లాలి? ఎక్కడ నిలబడాలి అని సలహాలిచ్చారు అని అన్నారు. పవన్ దగ్గరే ఈ ఐడియాలు వస్తాయి. సీట్లు ఇవ్వడం కూడా నాకు తెలియదా? సమస్యలపై వారంతా ఓ పద్ధతి ప్రకారం మాట్లాడాలి అని సూచించారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. జగన్ ఉన్నప్పుడు మరోలా మాట్లాడకండి’ అని చురకలు అంటించారు పవన్ కళ్యాణ్.
మోడీతో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నా..స్టీల్ ప్లాంట్ విషయంలో నేనూ ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నాను అని గుర్తు చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా మా ప్రిమిసెస్ కి పోలీసులు వచ్చారు అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతంగా ఉంటే నేనూ గౌరవిస్తా అని అన్నారు. నాతో గొడవ పెట్టుకుంటానంటే పెట్టుకోండి.. కొట్లాటకు నేనూ సిద్దమే.. గెలిచి నేనే బయటకి వస్తా.. అది గుర్తు పెట్టుకోండి అని పవన్ అన్నారు.