కరోనా నుంచి కోలుకునేందుకు ఇప్పటికే చాలా రకాల మందులు వచ్చాయి. వ్యాక్సిన్లతో పాటు రెమిడెసివిర్ లాంటివి కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఇవన్నీ చాలా కష్టపడితే గానీ దొరికేవి కావు. ఇక కరోనా వచ్చిన పేషెంట్ల సంగతి చాలా దారుణంగా ఉంది. వీరిలో ఎక్కువ మందికి శ్వాస ఆడక ప్రాణాలు కోల్పోతున్నాయి.
అయితే ఇలా శ్వాస ఇబ్బందులు తలెత్తే వారికి శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్ చెప్పారు. ఐవర్‌మెక్టిన్ అనే ట్యాబ్లెట్ కరోనాపై చాలాబాగా పనిచేస్తోందని వివరించారు. ఇది కరోనా వచ్చిన వారు వేసుకుంటే రెండు నుంచి మూడు రోజుల్లోనే కోలుకుంటున్నారని FLCCC చీఫ్ మెడికల్ ఆఫీసర్ పియరీ కోరీ తెలిపారు.
ఇది కరోనా పేషెంట్లలో ఇమ్యూనిటీ పవర్‌ను బాగా పెంచుతుందని, మళ్లీ కరోనా రాకుండా యాంటీబాడీలను విపరీతంగా మెరుగు పరుస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. దాదాపు 2,500మందిపై దీన్ని ప్రయోగించగా.. ఎక్కువమందిలో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. దీన్ని వాడితే వెంటిలేటర్‌పైకి వెళ్లే ప్రమాదాన్ని 40శాతం తగ్గిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా యాంటీ-పారాసైట్టాబ్లెట్ ఐవర్‌మెక్టిన్ నే ఎక్కువగా వాడుతున్నారు.