తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభ వార్త.. డీఎస్సీ పరీక్షలను యధావిధిగా నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.జూలై 11 నుంచి విద్యాశాఖ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
సబ్జెక్టులు, పోస్టుల వారీగా పరీక్షలు జరగనున్నాయి. పూర్తిస్థాయి షెడ్యూల్ ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ కాగా.. జూలై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించగా.. ఆ తేదీలను మార్పులు చేశారు. మొత్తం 13 రోజులు పరీక్షలను నిర్వహించనున్నారు.జూలై 18 న స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, పీఈటీతో పరీక్షలు మొదలయి,ఆగస్టు 5న లాంగ్వేజ్ పండిట్ హిందీతో పరీక్షలు ముగుస్తాయి. ఆన్ లైన్ పరీక్షలు కావడంతో ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయి. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి 2.79 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే డీఎస్సీ పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలని గత కొద్ది రోజులుగా అభ్యర్థులు నిరసన తెలుపుతున్నారు.