బ్లీచింగ్ పౌడర్ కొనేందుకు కూడా పంచాయతీల్లో నిధులు లేవు..సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే

-

తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు వెల్లడించారు.

బ్లీచింగ్ పౌడర్ కొనేందుకు కూడా పంచాయతీల్లో నిధులు లేవంటూ వార్తలు వస్తున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య లోపం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే మండిపడ్డారు. మురుగు నిర్వహణ పనులు చేయించేందుకు కూడా నిధులు లేవా అంటూ ఆయన ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా పోయిందని సిర్పూర్ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023-24 చివరి క్వార్టర్ వరకు పంచాయతీలకు నిధులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం జీతాలకు వాడకూడదని అన్నారు.వెంటనే పారిశుద్ధ్య పనుల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే హరీశ్ బాబు డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news