ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. ఇక వారంలో ఐదు రోజులే

-

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, రైతుల‌కు ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు వారంలో ఐదు రోజులే ప‌ని దినాలు ఉంటాయ‌ని ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్ర ముఖ్య మంత్రి భూపేశ్ బ‌ఘేల్ ప్ర‌క‌టించారు. అంతే కాకుండా అన్ష్ దాయి పింఛ‌ను యోజ‌న కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చే వాట‌ను కూడా పెంచుతు నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఇస్తున్న వాట కు మ‌రో 10 నుంచి 14 శాతం పెంచి ఇవ్వ‌నున్న‌ట్టు సీఎం భూపేశ్ బ‌ఘేల్ తెలిపారు.

దీంతో ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదీల ఉండ‌గా.. ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని రైతుల‌కు కూడా ముఖ్య మంత్రి భూపేశ్ బ‌ఘేల్ శుభ‌వార్త చేప్పారు. ఖ‌రీఫ్ సీజ‌న్ నుంచి రాష్ట్రంలో పండించే పప్పు ధాన్యాలు అన్నింటినీ క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌కే ప్ర‌భుత్వం కొనుగోలు చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. దీంతో రైతులు లాభప‌డుతార‌ని ఆయ‌న అన్నారు. కాగ రైతుల కోసం ఇప్ప‌టికే ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్ర ముఖ్య మంత్రి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news