ఉద్యోగులకి గుడ్ న్యూస్… త్వరలో పెన్షన్ పెంపు..!

-

ఉద్యోగులకి గుడ్ న్యూస్. కనీస పెన్షన్ త్వరలోనే భారీగా పెరగబోతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌కి కంట్రిబ్యూట్ చేసే లక్షలాది మంది ఉద్యోగుల పెన్షన్ సుప్రీంకోర్టు నిర్ణయంతో పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఇప్పుడైతే పెన్షన్ లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన బేసిక్ వేతనం రూ.15 వేలను సుప్రీంకోర్టు తీసేసే అవకాశం వుంది.

ఉద్యోగికి రూ.15 వేలు కంటే ఎక్కువగా బేసిక్ శాలరీ ఉన్నా సరే పెన్షన్ మాత్రం రూ.15 వేలుపైనే లెక్కిస్తారు. అయితే పెన్షన్ ని క్యాలిక్యులేట్ చేసే బేసిక్ వేతన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేయబోతుంది. ఒకవేళ కనుక బేసిక్ వేతనం రూ.20 వేలు ఉంటే అప్పుడు పెన్షన్ కూడా ఈ రూ.20 వేలుపైనే లెక్కించేలా చూస్తోంది సుప్రీంకోర్టు. ఇలా చేస్తే మినిమమ్ పెన్షన్ రూ.1000 దాకా పెరగనుంది.

ఉద్యోగులకు రూ.8,571 పెన్షన్ చేతికి మొత్తంగా రానుంది. ఇది ఇలా ఉంటే రూ.40 వేల బేసిక్ వేతనం ఉంటే రూ.15 వేలపైనే పెన్షన్ లెక్కిస్తూ ఉండటంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రస్తుత చట్టాలు ఆ విధంగా అనుమతించడం లేదు. అదే ఒకవేళ సుప్రీంకోర్టు కనుక వేతన పరిమితిని ఎత్తివేస్తే అప్పుడు ఉద్యోగుల పెన్షన్ బాగా పెరగనుంది.

పెన్షన్ రివిజన్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2014 నుంచి అమల్లోకి తీసుకు రావడం జరిగింది. ప్రైవేట్ రంగ ఉద్యోగులు వ్యతిరేకించారు. ఏప్రిల్ 1, 2019లో దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రూ.15 వేలపై పెన్షన్ లెక్కించేలా వేతనాన్ని నిర్ణయించడం సరైనది కాదంది. ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. సుప్రీంకోర్టు పెన్షన్ లెక్కించే ఈ వేతన పరిమితిని ఎత్తివేస్తే అప్పుడు ఉద్యోగుల పెన్షన్లు కూడా పెరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news