ఉపాధి హామీ కూలీలకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభ వార్త చెప్పింది. ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ… ప్రమాద భీమా వర్తించేలా కీలక నిర్ణయం తీసుకుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఈ పథకం లో చేరిన కార్మికులందరికీ.. రూ. 2 లక్షల ప్రమాద బీమా కల్పించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. 16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉండే వారందిరికీ… ఉచితంగా బీమా అందించనుంది.
సంబంధిత వ్యక్తుల నుంచి త్వరలోనే.. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్లు తీసుకోనుంది జగన్ సర్కార్. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి… వాలంటీర్లు పేర్లు నమోదు చేసేలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. కార్యాచరణ ను రూపొందిస్తోంది. అర్హులైన వారందరికీ.. ఈ స్కీమ్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇక జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.