రామగుండంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ ఎమ్మార్వో, ఆర్ఐ..!

-

రామగుండం నియోజకవర్గం అంతర్గాం ఎమ్మార్వో ఉయ్యాల రమేష్, ఆర్ఐ శ్రీధర్ లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల రామగుండం కు చెందిన ఆలకుంట మహేష్ తన ఇసుక ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకొని ఎమ్మార్వో కు అప్పగించారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నావని ఎమ్మార్వో ట్రాక్టర్ ను సీజ్ చేశారు. ఆ ట్రాక్టర్ ను రిలీజ్ చేయాలంటే 25 వేల డీడితో పాటు అదనంగా డబ్బులు ఇవ్వాలని ఎమ్మార్వో, ఆర్ఐ డిమాండ్ చేశారు. దీంతో మహేష్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు.

ఇక వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డిఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో ఈరోజు 25 వేల డీడి తో పాటు 12,000 లంచం తీసుకుంటుండగా ఆర్ఐ శ్రీధర్ ను పట్టుకున్నారు. వెంటనే డబ్బులు పడవేసి శ్రీధర్ పరారైనట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిలో బాధ్యుడైన ఎమ్మార్వో ను విచారణ చేసి కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి స్పష్టం చేశారు. కాగా ఇదే ఎమ్మార్వో గతంలో ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version