కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలవనియ్యను : సీఎం రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలవనియ్యను అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. అలాంటి ప్రయత్నాలు చేసిన వారిని కటకటాల వెనక్కి పంపిస్తామని అన్నారు. కిరాయి మనుషులతో అడ్డుకోవాలని చూస్తే సహించం అని హెచ్చరించారు. మహిళలకు పెత్తనం ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం ఉండదని అన్నారు. 

కేసీఆర్ చేసిన అప్పులకు నెల నెల 6,500 మిత్తి కడుతున్నామన్నారు. పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని తాగుబోతుల సమూహంగా మార్చారని మండిపడ్డారు. ఈ 11 నెలల్లో ప్రజలు ఆ పదేళ్లు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండాలని సూచించారు. కావాలంటే రోజూ ఫామ్ హౌస్ కు లిక్కర్ తానే పంపిస్తానని తెలిపారు. తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని ప్రముఖ క్రీడాకారులు ఒక్కో ఆటలో బ్రాండ్ అంబాసిడర్లు.. కేసీఆర్ మాత్రం మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version