వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద మహిళ ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణం వరంగల్ వెళుతున్న క్రమంలో, బస్టాండ్ వద్ద వరంగల్ బస్సులు లేకపోవడంతో మహిళలు, ప్రయాణికులు ధర్నా చేపట్టారు. కార్తీక మాసం మూడో సోమవారం సందర్బంగా రాజన్న దర్శనానికి వచ్చి తిరుగు ప్రయాణం వరంగల్ వెళుతున్న క్రమంలో బస్టాండ్ వద్ద ఉదయం 11గంటల నుండి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు బస్టాండ్ ఇబ్బందులు పడ్డారు.
ఈ విషయంపై ఆర్టీసీ సిబ్బందిని పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు చేసేదేమీ లేక బస్సులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. దాదాపు రెండు గంటలపాటు అటు ప్రయాణికులకు పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది ఆర్టీసీ సిబ్బంది భక్తులకు నచ్చజెప్పి ధర్నాను విరమింప చేసి వారికీ ప్రత్యేక బస్సులు తెప్పించి పంపించారు. ఈ ధర్నాతో తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో కిలోమీటర్ మేరా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రేపు వేములవాడ పట్టణంలో జరగనుంది. ఈ క్రమంలో నేడు బస్సులు లేవంటూ మహిళలు చేసిన ధర్నా హాట్ టాపిక్ గా మారింది.