రైతులకి ఊరట… ఒకేసారి రూ.18 వేలు…!

-

రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి రూ.18 వేలు పశ్చిమ బెంగాల్‌లోని రైతులకి అందిస్తున్నట్టు అమిత్ షా తెలిపారు. ఎన్నికల హామీ లో భాగంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. రైతుల కి అండగా ఉండడానికి, చేయూతనివ్వడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన స్కీమ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్.

ఈ పధకం లో రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 మూడు విడతల్లో అందుతున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం 8వ విడత డబ్బులు అందించేందుకు కూడా రెడీ అవుతోంది. ఇలా అన్ని రాష్ట్రాల వాళ్లకి రూ.2 వేలు లభిస్తే ఇక్కడ మాత్రం ఒకేసారి రూ.18,000 లభించనున్నాయి. ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్‌లో పీఎం కిసాన్ స్కీమ్ అమలులో లేదు. అయితే ఈ స్కీమ్ ని ఇప్పుడు అమలు చేస్తామని మమత ప్రకటించారు.

అమిత్ షా కూడా బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే స్కీమ్ డబ్బులు రైతుల ఖాతాల్లోకి పంపిస్తున్నట్టు చెప్పడం జరిగింది. గత రెండేళ్లలోని డబ్బులు రూ.12 వేలు, ఈ ఏడాది రూ.6 వేలు మొత్తం డబ్బలు కలిపి ఒక్కసారే ఇస్తామని అన్నారు. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే.. రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి రూ.18 వేలు వచ్చి చేరతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version