లోటస్ పాండ్ లోని షర్మిల నివాసంలో హైదరాబాద్, రంగారెడ్డితో పాటు ఖమ్మం జిల్లాలకు చెందిన వైయస్ఆర్ ముఖ్య అనుచరులతో వై.యస్ షర్మిల కాసేపట్లో సమావేశం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న జిల్లాలు కాకుండా తెలంగాణలోని మిగిలిన జిల్లాలో ఆత్మీయ సమ్మేళన సమావేశాలపై షర్మిల ఈ సమావేశంలో చర్చించనున్నట్టు చెబుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానున్నట్టు చెబుతున్నారు.
ఈ నెల 21న ఖమ్మంలో జరగాల్సిన వాయిదా పడడంతో ఆ జిల్లాకు చెందిన వై.యస్.ఆర్ అభిమానులతో లోటస్ పాండ్ లోనే షర్మిల మాట్లాడనున్నట్టు చెబుతున్నారు. నిజానికి గ్రాడ్యుయేట్ MLC ఎలక్షన్ కోడ్ కారణంగా ఫిబ్రవరి 21 న వైయస్ షర్మిల గారితో జరగాల్సిన ఖమ్మం జిల్లా వైయస్సార్ అభిమానుల ఆత్మీయ సమావేశం వాయిదా వేయడం జరిగిందని ఆమె ముఖ్య అనుచరుడు కొండా రాఘవరెడ్డి ప్రకటించారు. దీంతో ఆ జిల్లాల వారిని కూడా ఇక్కడే కలవనున్నట్టు చెబుతున్నారు.