ఐడీబీఐ కస్టమర్స్ కి గుడ్ న్యూస్…!

మీకు ఐడీబీఐ బ్యాంక్ లో ఖాతా వుందా…? అయితే మీకు గుడ్ న్యూస్. ఈ బ్యాంక్ సిస్టమ్యాటిక్ సేవింగ్స్ ప్లాన్ ప్లస్ (IDBI Bank SSP Plus) పేరు తో ప్రత్యేక పథకాన్ని తీసుకు రావడం జరిగింది. దీని వలన కస్టమర్స్ కి లాభం కలగనుంది.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే… ఈ స్కీం లో మనకు నచ్చిన మొత్తాన్ని ప్రతీ నెలా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇన్వెస్ట్ చెయ్యాలంటే ఎక్కువ డబ్బులని పెట్టాలని ఏమి లేదు. మీరు కావాలంటే కేవలం రూ.100తో కూడా మనం డిపాజిట్ ప్రారంభించొచ్చు.

ఇది ఇలా ఉంటే ఎంత అయితే నిర్ణయిస్తారో అంత అమౌంట్ మన ఖాతా నుంచి ప్రతీ నెల కట్ అయిపోతుంది. ఆ మొత్తం ఓ ప్రత్యేక అకౌంట్‌ లో జమవుతూ ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా మనకు వడ్డీ కూడా లభిస్తుంది. అదే విధంగా వడ్డీతో పాటు అదనంగా రూ.5 లక్షల వరకు ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. చూసారా ఎన్ని ప్రయోజనాలో..!

అలానే 1000 రిడీమబుల్ రివార్డ్ పాయింట్లు కూడా అందిస్తుంది బ్యాంకు. ఈ స్కీమ్ ద్వారా ఏడాది నుంచి పదేళ్ల వరకు డబ్బులను మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు.ఈ సిస్టమ్యాటిక్ సేవింగ్ ప్లాన్ ను కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా సమీపం లోని బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ప్రారంభించి… ఈ ప్రయోజనాలని ఈజీగా పొందవచ్చు.