IIT – JEE తెలుగు స్టూడెండ్స్‌కు పండ‌గ చేస్కొనే న్యూస్‌

-

తెలుగు విద్యార్థులకు తీపి కబురు అందించింది. కేంద్రం ఇప్పటివరకు జాతీయ స్థాయిలో నిర్వహించే జె.ఇ.ఇ మెయిన్స్ పరీక్షను మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తెలుగులో రాసేందుకు నిబంధనలు లేవు. తాజాగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ జేఈఈ మెయిన్స్ తెలుగులో నిర్వహించేలా అంగీకరించినట్టు సమాచారం. ఈ పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. 2021లో నిర్వహించే పరీక్షల నుంచి ఈ మెయిన్స్ పరీక్షను తెలుగులో నిర్వహించనున్నారు.

ప్రస్తుతం జేఈఈ మెయిన్ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తున్నారు. తాజా ప్రతిపాదన ప్రకారం ఇకపై తెలుగుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, ఉర్దూ భాషలోనూ నిర్మించనున్నారు. జేఈఈ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలనే డిమాండ్లు చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి. అయితే ఈ డిమాండ్‌పై గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే ప్రతి ఏటా జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసే తెలుగు విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో ఈ పరీక్షను నిర్వహించాలన్న‌ డిమాండ్ ఎక్కువ అవుతుండడంతో… ఇప్పుడు మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జేఈఈ మెయిన్స్ పరీక్షకు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి కూడా ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వాస్త‌వంగా స‌బ్జెక్టుపై మంచి అవ‌గాహ‌న ఉన్న విద్యార్థులు కూడా భాషా స‌మ‌స్య నేప‌థ్యంలో జేఈఈలో స‌రైన మార్కులు సాధించ లేక‌పోతున్నారు. ఇప్పుడు స‌బ్జెక్ట్‌పై ప‌ట్టున్న వారికి భాషా స‌మ‌స్య పెద్ద అవరోధం కాదు. ఏటా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2 ల‌క్ష‌ల మంది విద్యార్థులు మెయిన్స్ రాస్తున్నారు. వీరంద‌రికి కేంద్రం నిర్ణ‌యం పెద్ద రిలీఫ్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news