రోజూ 9 గంటలు నిద్రిస్తే.. ఆ కంపెనీ రూ.1 లక్ష ఇస్తుంది..!

-

మీరు బాగా నిద్రించగలరా..? ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా.. ఎలాంటి వాతావరణంలో అయినా క్షణాల్లోనే నిద్రపోగలరా..? రోజుకు 9 గంటల వరకు నిద్రించగలిగే సత్తా మీలో ఉందా..? అయితే ఆ కంపెనీ అందిస్తున్న ఆఫర్ మీ కోసమే. మీరు రోజుకు 9 గంటల పాటు నిద్రిస్తే.. ఎంచక్కా రూ.1 లక్ష పొందవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!

this startup will pay you rs 1 lakh if you sleep daily 9 hours

వేక్‌ఫిట్ (https://www.wakefit.co/sleepintern/) అనే ఓ స్టార్టప్ కంపెనీ తమ కంపెనీలో కొత్తగా ఓ ఇంటర్న్‌షిప్‌ను చేపట్టింది. అందులో భాగంగా ఔత్సాహికులు రోజూ వారు సూచించిన విధంగా కచ్చితంగా 9 గంటల పాటు నిద్రించాలి. అలాగే కాఫీ, టీ లాంటి కెఫీన్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగరాదు. ఫోన్లు, సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండాలి. ఇక వారు సూచించిన లేదా క్రియేట్ చేసిన వాతావరణ పరిస్థితుల్లో ఎంపిక చేసిన కంపెనీలకు చెందిన పరుపులపై 9 గంటల పాటు నిద్రించాలి. దీంతో ఆ నిద్రించే వ్యక్తుల స్థితిని ఇంటర్న్‌షిప్ చేసే వారు పరిశీలిస్తారు. ఇక 100 రోజులు అలా చేస్తే రూ.1 లక్ష నగదును స్టయిపెండ్ రూపంలో చెల్లిస్తారు. ఈ క్రమంలో ఆసక్తి ఉన్నవారు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.

కాగా ఈ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ పట్ల వేక్‌ఫిట్ కో ఫౌండర్, డైరెక్టర్ చైతన్య రామలింగ గౌడ మాట్లాడుతూ.. భిన్నమైన వ్యక్తులు భిన్న వాతావరణ పరిస్థితుల్లో ఎంత త్వరగా నిద్రిస్తారో, వారి పని ఒత్తిడి, నిద్ర అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దీంతో సౌకర్యవంతమైన నిద్ర పొందేందుకు కావల్సిన మార్గాలను అన్వేషించడం సులభతరమవుతుందని ఆయన తెలిపారు. మరింకెందుకాలస్యం.. మీరు కూడా బాగా నిద్రించే వారైతే వెంటనే ఆ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోండి మరి..!

Read more RELATED
Recommended to you

Latest news