హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ శుభవార్త చెప్పింది.ఇక మీదట మెట్రో రవాణా సేవల సమయాన్ని పొడగిస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం నుంచి శనివారం రోజుల్లో ప్రస్తుతం 6:00AM – 11:00PM వరకు ఉన్న ట్రైన్ టైమింగ్స్ ను 11:45PM వరకు పెంచింది.
అయితే, సోమవారం నుంచి శుక్రవారం రోజుల్లో మాత్రమే రాత్రి 11.45 వరకు ట్రైన్స్ అందుబాటులో ఉండనున్నాయి. శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే నగరంలో శని, ఆదివారాల్లో పెద్దగా రష్ ఉండదని.. సాఫ్ట్ వేర్ వాళ్లకు ఎలాగూ సెలవు ఉంటుందని తెలిసిందే. ఈ క్రమంలోనే శని, ఆదివారాల్లో పాతటైమింగ్స్ ఉండనున్నాయి. ఇక ఆదివారం ఉదయం 7 గంటలకు ట్రైన్స్ స్టార్ట్ కానున్నాయి. మిగతా వర్కింగ్ డేస్‌లో ఉదయం 6 గంటలకే ప్రారంభం అవుతాయి.వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి కొత్త టైమింగ్స్ అందుబాటులోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.
హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పొడిగించిన L&T మెట్రో సంస్థ
6:00AM – 11:00PM వరకు ఉన్న ట్రైన్ టైమింగ్స్ ను 11:45PM వరకు పెంపు
మారిన మెట్రో టైమింగ్స్ ఏప్రిల్ 1వ నుండి అమలు pic.twitter.com/Yht0noyLcB
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2025