పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్…!

-

తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్స్ కి ప్రయోజనం కలిగేలా నిర్ణయం తీసుకుంది కేంద్రం. పెన్షనర్లకు సింగిల్ విండో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ కొత్త పోర్టల్ వలన పెన్షనర్లకు రిలీఫ్ ని ఇస్తుంది.

పెన్షనర్లు వారి ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి వ్యక్తిగతంగా వివిధ అధికారులను సంప్రదించకుండా ఒకే చోటు సమస్యను పరిష్కరించడానికి ఈ సింగిల్ విండో పోర్టల్ ని తీసుకు వచ్చారు. పింఛను బకాయిలను ప్రాసెస్ చేయడానికి, మంజూరు చేయడానికి లేదా పంపిణీ చేయడానికి వంటి వాటికి ఈ కొత్త పోర్టల్ ని లింక్ చేశామని అన్నారు.

పెన్షనర్లు చేసిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత వాటిని సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా డిపార్ట్‌మెంట్‌కు పరిష్కారం కోసం పంపిస్తామని తెలియజేయడం జరిగింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల విజ్ఞానం, అనుభవం, కృషిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా వుంది అని జితేంద్ర సింగ్ అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా 100 నగరాల్లో లైఫ్ సర్టిఫికెట్ల సేకరణ కోసం డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు కూడా ఉన్నాయన్నారు.

ఇక ఈ సింగిల్ విండో పోర్టల్ కి సంబంధించి ఈ విషయాలను చూడండి. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చారు. పింఛన్‌దారులు ఈ సైట్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. అలానే అసోసియేషన్స్ కూడా ఈ పోర్టల్ ద్వారా ప్రభుత్వంతో అనుసంధానమై ఉండొచ్చు. అదే విధంగాపెన్షనర్లు, నోడల్ ఆఫీసర్లు కూడా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు స్టేటస్‌ను చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news