రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుండి వెంటనే రిఫండ్ డబ్బులు..!

-

రైల్వే ప్రయాయికులకి గుడ్ న్యూస్. రైలు ప్రయాణం చేసేవాళ్ళు తప్పక ఈ విషయాలని తెలుసుకోవాలి. తాజాగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC కొత్త పేమెంట్ గేట్‌వే సర్వీసులు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

దీనినే ఐపే అంటారు. ఈ పేమెంట్ ఆప్షన్ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

ఈ పేమెంట్ ఆప్షన్ ద్వారా ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటే.. ఏ కారణం చేతనైన మీరు జర్నీ చేయడంకి వీలు అవ్వకపోతే ట్రైన్ టికెట్ ముందుగానే క్యాన్సిల్ చేసుకున్నారంటే మీ టికెట్ డబ్బులు వెంటనే మీ బ్యాంక్ ఖాతాలో పడతాయి.

దీనితో ఈజీ అవుతుంది. పైగా రైల్వే టికెట్ రిఫండ్ డబ్బుల కోసం మీరు ఎదురు చూడక్కర్లేదు.
అలానే ఒకవేళ మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయి టికెట్ బుక్ అవ్వలేదు అంటే.. నిమిషాల్లో రిఫండ్ అవుతాయి.

ఒకవేళ మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి.. ఫైనల్ చార్ట్ తయారు అయిన తర్వాత మీ టికెట్ బుక్ అవ్వలేదు అంటే మీ టికెట్ ఆటోమేటిక్‌గానే క్యాన్సల్ అయిపోయి.. మీ డబ్బులు మీకు వెంటనే రిఫండ్ అవుతాయి. ఇలా ఈ పేమెంట్ ద్వారా ఈ ప్రయోజనాలు మీరు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news