ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆదివారం కూడా అన్ని బ్రాంచులు ఓపెన్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి శుభవార్త చెప్పింది. ఎల్ఐసి ఐపీఓ లో పాల్గొనే వారు దీనిని తప్పక చూడాలి. ఈ ఆదివారం (మే 8న) కూడా స్టేట్ బ్యాంక్ బ్రాంచులు అన్నింటినీ ఓపెన్ చేస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ చెప్పింది.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. అన్ని ఎస్‌బీఐ సంబంధిత బ్యాంకు బ్రాంచులను ఆదివారం కూడా ఈ మెగా ఐపీఓ కోసం తెరిచి ఉంచాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అంది. ఈ ఆదేశాల మేరకు ఎస్‌బీఐ తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఈ గుడ్‌ న్యూస్ చెప్పింది.

ఈ ట్వీట్‌లో ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనే కస్టమర్ల సౌకర్యార్థం అప్లికేషన్లను అంగీకరించేందుకు 2022 మే 8న బ్రాంచులు ఓపెన్ చేసి ఉంటాయి అని స్టేట్ బ్యాంక్ అంది. ఇంతకు ముందే శనివారం కూడా ఎల్ఐసీ ఐపీఓ లో పాల్గొన వచ్చని గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంకు తాజాగా ఆదివారం కూడా అవకాశం ఇస్తోంది.

అదే విధంగా ఎల్ఐసీ ఐపీఓలో పాల్గొనే వారికి మరో బంపర్ ఆఫర్ అందిస్తోంది. అదేమిటంటే ఉద్యోగులకు రూ.20 లక్షల వరకు రుణాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్టు బ్యాంక్ తెలిపింది. వడ్డీ రేటును కూడా 7.10 శాతంగానే విధిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version