మహేష్ బాబు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ సర్కార్..

-

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా “సర్కారు వారి పాట”. అయితే స‌ర్కారువారి పాట సినిమాకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపున‌కు అనుమ‌తి నిచ్చింది ఏపీ ప్ర‌భుత్వం. ఈ నెల 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్ల‌పై రూ.45 మేర‌ పెంచుకోవ‌చ్చంటూ ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇచ్చింది. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఆయా సినిమాల విడుద‌లకు ముందు స‌ద‌రు సినిమా నిర్మాత‌లు ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌లిసి త‌మ బ‌డ్జెట్‌ను చూపి సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే స‌ర్కారువారి పాట సినిమా యూనిట్ కూడా ఏపీ ప్ర‌భుత్వాన్ని టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థించింది. ఈ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన ఏపీ స‌ర్కారు… స‌ర్కారువారి పాట సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అనుమ‌తి మంజూరు చేసింది. దీంతో సర్కారు వారి పాట చిత్ర యూనిట్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version