ప్రముఖ భారత దేశ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూ వస్తుంది..ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.కార్డు ద్వారా కొనుగోలు జరిపే వారికోసం కొత్తగా ఆఫర్లను అందిస్తుంది.ప్రస్తుతం కార్డు ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది.
ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను ఇస్తుంది. SBI కార్డు ద్వారా జరిగే కొనుగోలుపై డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు అందిస్తుంది. కొత్తగా ఎంపిక చేసిన VIVO స్మార్ట్ ఫోన్‌లపై రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తుంది. అలాగే Samsung స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్‌లపై రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఎంచుకున్న EMI లావాదేవీలపై మాత్రమే అందుబాటులో ఉంటాయి..ఈ ఆఫర్లు పొందడం కోసం Samsung లేదా VIVO స్టోర్‌లలో వివరాలు తెలుసుకొవచ్చు. ఈ కార్డు పై ఉన్న మరిన్ని వివరాలను తెలుసుకోవడం కోసం https://www.sbicard.com/en/home.page ను చూడగలరు..