ఎస్బీఐ వినియోగదారులకి శుభవార్త..! ఈ సేవలతో మరెంతో లాభం…!

-

దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త సర్వీసులు ప్రారంభించింది. దీనితో వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మంచి బెనిఫిట్స్ తో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకి తీపి కబురు చెప్పింది. అయితే దీనిలో ఏకంగా 56 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఎంతో సులభంగా ఆన్లైన్ ద్వారా ఈ సేవలు పొందవచ్చు అయితే తాజాగా కస్టమర్ల కోసం ఈ సర్వీసుల్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవిష్కరించింది ప్రత్యేకమైన వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

SBI
SBI

పెన్షనర్ల కోసం పెన్షన్ సేవ వెబ్ సైట్ ను తీసుకువచ్చింది. అయితే ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి పెన్షన్ కు సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు దేశంలోనే అతిపెద్ద పెన్షన్ పేమెంట్ బ్యాంక్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనసాగుతోంది అయితే 54 లక్షల మందికి పెన్షన్ అందిస్తోంది ఎస్బీఐ. అందుకే వీళ్ళందరి కోసం వెబ్ పోర్టల్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే పెన్షన్ తీసుకునేవారు ఏం చేయాలంటే… ఎరియర్ క్యాలిక్యులేషన్ షీట్స్‌ను స్వయంగా, సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షన్ రశీదు, ఫామ్ 16 వంటి వాటిని కూడా వెబ్‌సైట్ నుంచి స్వయంగా డౌన్‌లోడ్ చేయొచ్చు. పెన్షన్ ప్రొఫైల్ వివరాలు కూడా ఎంతో సులువుగా తెలుసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ వివరాలు, లైఫ్ సర్టిఫికెట్ స్టేటస్ కూడా చూడొచ్చు. ఎస్‌బీఐలో పెన్షన్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరూ ఎస్‌బీఐ పెన్షన్ సేవ వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.

పెన్షన్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ బ్రాంచ్ కోడ్, పుట్టిన తేదీ, మెయిల్ ఐడీ వంటివి అవసరం పడవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మెయిల్ ఐడీకి లింక్ వస్తుంది. దీనిపై క్లిక్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత పాస్‌వర్డ్, యూజర్ ఐడీ సాయంతో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. ఇలా ఎంతో సులువుగా ఈ పోర్టల్ ద్వారా మీరు కావాల్సిన సమాచారం పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news