బీసీ రిజర్వేషన్ల పెంపు పై సుప్రీం కోర్టు కు వెళ్తాం : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

బీసీ రిజర్వేషన్ల పెంపు  కోసం సుప్రీం కోర్టు కు వెలుదామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. అఖిల భారత బీసీ ఫెడరేషన్ – బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఖైరతాబాద్ లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య లో జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ సమక్షంలో నిర్వహించిన బీసీల సమాలోచన సమావేశంలో సమగ్ర కులగణన నిర్వహణ జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు పై పవర్ పాయింట్ ప్ర జంటేషన్, బీసీ రిజర్వేషన్లపై తయారు చేసిన చట్టం డ్రాఫ్ట్ పై చర్చించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తమిళనాడుకు వెళ్లి మేం బీజీ రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తామన్నారు. ఢిల్లీకి మన సంఘాల తరుపునా ప్రతినిధి బృందం వెళ్లి కేంద్రానికి బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన వాదనను వినిపిద్దామన్నారు. బీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో ఉద్యోగ రిక్రూట్ మెంట్లు, కళాశాలలు, మెడికల్ కాలేజీలలో కూడా బీజీ రిజర్వేషన్లు ఉల్లంఘన జరుగుతుందన్నరు. ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు ఇస్తారో లేదో ప్రభుత్వం తేల్చుకోవాలని, మనం మాత్రం అన్ని రకాలుగా రిజర్వేషన్ సాధనకు పోరాడాల్సిందేనన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news