కేంద్రం: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్…!

-

తాజాగా మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… 11.73 లక్షల మందికి రూ.15,438 కోట్ల రిఫండ్లను జారీ చేసినట్లు చెప్పడం జరిగింది.

ఈ డబ్బులు వారి ఖాతాల లోకి కేవలం ఒకే నెలలో ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. అలానే పర్సనల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్స్ విలువ రూ.5,047 కోట్లుగా ఉంది. దాదాపు 11.51 లక్షల మందికి ఈ రిఫండ్స్ జారీ అయ్యాయి. ఇది ఇలా ఉండగా కార్పొరేట్ ట్యాక్స్ రిఫండ్స్ విలువ రూ.10,392 కోట్లుగా ఉంది. ఈ మొత్తం 21,487 కోట్ల ట్యాక్స్ పేయర్స్‌కు వచ్చింది.

ఇక పోతే ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT దాదాపు రూ.15,438 కోట్ల విలువైన రిఫండ్స్‌ను జారీ చేసింది. 11.73 లక్షల మందికి పైగా ట్యాక్స్ పేయర్లకు ఈ డబ్బులు కూడా ఇచ్చేయడం జరిగింది. 2021 ఏప్రిల్1 నుంచి మే 3 మధ్య కాలంలో ఈ రిఫండ్స్ జారీ చేసారు అని చెప్పడం జరిగింది. ట్విటర్ ద్వారా ఈ సమాచారం తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రిఫండ్స్‌ను జారీ చేసిందో వివరణ లేదు. కాగా గత ఆర్ధిక సంవత్సరం 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.2.62 లక్షల కోట్ల విలువైన రిఫండ్స్‌ను జారీ చేయగా… 2.38 కోట్ల మందికి ఇవి అందినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news