తెలంగాణ రైతులకు శుభవార్త.. ఎల్లుండి నుంచి రైతుబంధు నిధులు విడుదల

-

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రైతుబంధు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రైతన్నలకు.. కేసీఆర్ సర్కార్ అదిరిపోయే వార్త చెప్పింది. డిసెంబర్ 28వ తేదీ అంటే.. ఎల్లుండి నుంచి యాసంగి కాలానికి సంబంధించిన రైతుబంధు నిధులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్.

ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 15వ తేదీ లోపే రైతుబంధు నిధులను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల.. డిసెంబర్ 28 వ తేదీ అది వాయిదా పడింది. ఒక్క ఒకరం ఉన్న వారికి.. మొదటగా రైతుబంధు నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తరవాత రెండు ఎకరాలు.. ఇలా పది రోజుల వరకు రైతుబంధు నిధులను విడుదల కానున్నాయి. అసలైన లబ్ది దారులందరికి.. రైతుబంధు నిధులను విడుదల చేయనుంది సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version