తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. రుణమాఫీ రెండో విడత నిధుల విడుదలపై కీలక ప్రకటన చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. రేపు రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల కానున్నాయి అధికారులు ప్రకటించారు. లక్షన్నర లోపు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి రేపు నిధులు విడుదల కానున్నాయి.
ఈ మేరకు అసెంబ్లీ లో ప్రారంభించనున్నారు సిఎం రేవంత్. అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సిఎం రేవంత్..అనంతరం మాట్లాడతారు. ఇక అటు నేడు బిఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. విద్యుత్ మీటర్ల అంశం పై వాయిదా తీర్మానం ఇవ్వనుంది బిఆర్ఎస్. సీఎం రేవంత్ రెడ్డి మా పై బురద జల్లే ప్రయత్నం చేశారని దీని పై చర్చకు సిద్దమంటున్నది బిఆర్ఎస్. హోం శాఖ,మెడికల్ అండ్ హెల్త్ పై మాట్లాడనున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.