తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..పరీక్షల లేట్ ఫీజు తగ్గింపు

-

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు లక్షన్నరమంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షల ఆలస్య రుసుము రూ. వెయ్యి నుంచి రూ. వందకు తగ్గింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి ఫీజును తగ్గించాలని ఇంటర్ బోర్డును ఆదేశించారు.

ఎంపి అసదుద్దీన్ కూడా ఆలస్య రుసుము లేకుండా ఫీజులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ కళాశాలలోని విద్యార్థులకు పరీక్షల ఆలస్య ఫీజులు రూ.1000 నుంచి రూ. వందకు తగ్గిస్తున్నట్లు కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఓ ప్రకటన జారీ చేశారు. ఆ విద్యార్థులు ఈనెల 7, 8 తేదీల్లో పరీక్ష ఫీజులు చెల్లించాలి. మిగిలిన కళాశాలలోని విద్యార్థులు గతంలో ప్రకటించిన మేరకే పరీక్ష ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version