తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం కొలిక్కిరావడం లేదు. మొన్న దసరా నవరాత్రుల ఉత్సవాలకు సోంత ఊళ్లకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులుకు నిరాశ మిగిలింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య నడిపే అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో దసరా ఉత్సవాలకు కూడా బస్సులు నడిపే అంశంలో క్లారిటీ రాలేదు. అధికారుల స్థాయిలో జరుపుతున్న చర్చలు వరుసగా విఫలమవుతున్నాయి.
దసరా నవరాత్రులు ప్రారంభమైనా ఇప్పటికీ ఏపీ-తెలంగాణ మధ్య బస్సుల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ పడలేదు. దీంతో ప్రైవేటు బస్ యాజమాన్యాలు లాభాల పంట పండించుకుంటున్నాయి. ఇక తెలంగాణ – ఏపీ మధ్య చర్చలు ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. రేపు హైదరాబాద్ లో రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీల సమావేశం జరగనున్నట్టు చెబుతున్నారు. సమావేశం తర్వాత అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం పై సంతకాలు ఉన్నతాధికారులు చేయనున్నట్టు చేబుతున్నారు.