శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజీ

-

శబరిమల వెళ్లే యాత్రికులకు ట్రావన్ కోర్ దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ మేరకు స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు రూ.5లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజీని కల్పిస్తుంది. ఆలయానికి లక్షల్లో యాత్రికులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. యాత్రకు వచ్చిన భక్తులు ఎవరైనా దురదృషవశాత్తు ప్రాణాలు కోల్పేతే వారిని తమ స్వగ్రామాలకు తరలించే బాధ్యతను కూడా ట్రావన్ కోర్ దేవస్థానం తీసుకోనుంది. 

అలాగే ఇన్సూరెన్స్ డబ్బులు రూ.5లక్షలను అందజేయనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అయ్యప్ప మాలధారణ భక్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడితో విమానాల్లో ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. 2025 జనవరి 20వ వరకు మాత్రమే ఆదేశాలు అమలులో ఉంటాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. మరోవైపు కేరళ ప్రభుత్వం అయ్యప్ప దర్వన వేళల్లో స్వల్ప మార్పులు చేసింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version